logo

బియ్యం తూకంలో కోతలు

ఆదోని పట్టణంలో ఇంటింటికి రేషన్‌ బియ్యం సరఫరా చేసే ఆటోల్లో బియ్యం కోతలు పడుతున్నాయి. ఇళ్ల ముందుకే వచ్చి అందిస్తున్న బియ్యం తూకంలో ప్రతిసారీ రెండు కిలోల మేర తక్కువ వేస్తున్నారు.

Published : 05 Feb 2023 03:39 IST

ఎలక్ట్రానిక్‌ తూకంపై అడుగు భాగంలో ఉంచిన ఖాళీ గోనె సంచి, ఆపై నిండు సంచితో తూకం

న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణంలో ఇంటింటికి రేషన్‌ బియ్యం సరఫరా చేసే ఆటోల్లో బియ్యం కోతలు పడుతున్నాయి. ఇళ్ల ముందుకే వచ్చి అందిస్తున్న బియ్యం తూకంలో ప్రతిసారీ రెండు కిలోల మేర తక్కువ వేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ కాటాపై ఖాళీ గోనెసంచితోపాటు నిండు బియ్యం సంచి ఉంచి తూకం వేసి లబ్ధిదారులకు బియ్యం వేస్తున్నారు. ఈ లెక్కన రెండు సంచులకు కలిపి సరాసరి రెండు కిలోల మేర కోత పడుతోందని జనం వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బియ్యం వేయమంటూ గద్దిస్తున్నారని, చేసేదిలేక ఇచ్చిందే తీసుకెళ్తున్నామంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని