logo

ఎస్పీ స్పందనకు 101 వినతులు

నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలు విన్నవించారు

Published : 07 Feb 2023 04:30 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలు విన్నవించారు. విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 101 మంది బాధితులు వినతులు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ అదనపు ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, అదనపు ఎస్పీ డి.ప్రసాద్‌, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన సమస్యల్లో కొన్ని..

* తన భర్త హింసిస్తున్నాడని, తగిన చర్యలు తీసుకుని కాపురం చక్కదిద్దాలని అమడగుంట్లకు చెందిన నాగేశ్వరమ్మ కోరారు.
* తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసి తమపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు స్వామిరెడ్డినగర్‌కు చెందిన లత విన్నవించుకున్నారు.
* రస్తాకు అడ్డంగా రాళ్లు వేసి ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు మండలం ఇ.తాండ్రపాడుకు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని