logo

ఎస్టీల్లో ఇతరులను చేర్చడం అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకులు, బెంతు, ఓరియాలను చేర్చాలని నిర్ణయించడం అన్యాయమని గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 02:49 IST

గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకులు, బెంతు, ఓరియాలను చేర్చాలని నిర్ణయించడం అన్యాయమని గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఇతరు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి శ్రీనివాసనగర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తీర్మానం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌, నాయకులు రవి నాయక్‌, ఓంకార్‌ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం గిరిజనుల గొంతు కోసే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులకు అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. జీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లేశ్‌ నాయక్‌, ఎరుకుల పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు, నాగార్జున, తిరుపాలు, సుంకన్న, ఉషారాణి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని