నిర్లక్ష్యం చేస్తే సమ్మె తప్పదు
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సమ్మె తప్పదని ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి హెచ్చరించారు.
ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి హెచ్చరిక
శిబిరంలో మాట్లాడుతున్న గిరికుమార్‌రెడ్డి
కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సమ్మె తప్పదని ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఐకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ అధ్యక్షత వహించారు. గిరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ 83 రోజులుగా శాంతియుతంగా నిరసన చేపడుతున్నామన్నారు. సామరస్య వాతావరణంలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. ఇకనైనా స్పందించకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా నాయకులు రామానాయుడు, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, అనీష్, లక్ష్మణ్, ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MotoGP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. నెటిజన్ల మొట్టికాయలతో సారీ!
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?