logo

Buggana: బుగ్గనా.. ఏ పేరు పెడదాం.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న చిత్రాలు

పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డుకు బుగ్గన మార్గ్‌ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్‌, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది.

Updated : 01 Jul 2023 08:58 IST

పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డుకు బుగ్గన మార్గ్‌ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్‌, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది. మరి దీనికి ఏమని నామకరణం చేస్తారని మంత్రి బుగ్గనపై ప్లకార్డులను ఏర్పాటు చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: రోడ్లకు పేరు పెట్టుకోవడం కాదు.. డోన్‌ పట్టణంలో సమస్యలు పరిష్కరించాలి.. శ్రీరామానగర్‌, నల్లగుట్ట కాలనీల్లో పనులు చేయకపోతే ఎలా...? అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి నీరు నిల్వ ఉండి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెదేపా పట్టణశాఖ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామానగర్‌, నల్లగుట్ట ప్రాంతాలను సందర్శించి, కాలనీవాసులతో నీటిలో దిగి నిరసన తెలిపారు. శ్రీరామానగర్‌లో బుగ్గన స్విమ్మింగ్‌పూల్‌ రోడ్డు అనే ప్లకార్డులను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించకుంటే తెదేపా తరఫున సొంత నిధులతో పనులు చేపడతామన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల బీసీ సెల్‌ అధ్యక్షుడు పీవీసీ మల్లికార్జున, డోన్‌, ప్యాపిలి పార్టీ మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాసులుయాదవ్‌, గండికోట రామసుబ్బయ్య, నియోజకవర్గ తెదేపా యువ నాయకుడు గౌతమ్‌రెడ్డి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

మురుగులో నిల్చొని నిరసన తెలుపుతున్న తేదేపా నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు