logo

మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని  మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్,  మదీనా అన్నారు.

Published : 24 Apr 2024 11:10 IST

గోనెగండ్ల : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని  మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్,  మదీనా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఇప్పుడు మైనారిటీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. గతంలో పార్లమెంటు సాక్షిగా ఎన్‌ఆర్సీ, సీసీఏలకు మద్దతు తెలిపింది వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కాదా  అని ప్రశ్నించారు. మైనారిటీలకు వచ్చే పథకాలపై ఆంక్షలు విధించి ఓట్ల కోసం తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ పాలనలో మైనారిటీలపై దాడులు, అత్యాచారాలు జరిగాయన్నారు. తెదేపా పాలనలో ఆడ బిడ్డలకు రూ.50వేలు, రంజాన్‌ తోఫా, దుకాణ్‌మకాన్‌, హజ్‌యాత్రకు సబ్సిడీ, మోజాన్‌ ఇమామ్లకు గౌరవ వేతనం, మసీదులకు రంగులు వేయడం, కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.  కూల్చడం, తాకట్టు పెట్టడం, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు మైనారిటీలు సరైన రీతిలో బుద్ది చెబుతారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని