logo

బాలికలపై వివక్ష తగదు : కలెక్టర్‌

బాలికలపై వివక్ష చూపొద్దని, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు అన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో

Published : 25 Jan 2022 02:44 IST

జాతీయ బాలికా దినోత్సవంలో కలెక్టర్‌ వెంకట్‌రావు, అధికారులు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : బాలికలపై వివక్ష చూపొద్దని, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు అన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా, పురుషుల నిష్పత్తిలో తేడాలు ఉండటం ఆందోళన కరమన్నారు. బాలురతో సమానంగా విద్యనందించాలని, ఎక్కడా చిన్నచూపు చూడొద్దన్నారు. మెహందీ, వివిధ పోటీల్లో  విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్షేమాధికారి జరినా బేగం, సీడీపీవోలు శాంతిరేఖ, రాజేశ్వరి, శైలశ్రీ, మెహరున్నిసా పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం
మహబూబ్‌నగర్‌ పట్టణం : ప్రజా ఫిర్యాదులు ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు ఆదేశించారు. సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన పలు ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 73306 64001 వాట్సాప్‌ చరవాణి ద్వారా ఆన్‌లైన్‌ ప్రజావాణికి 34 సమస్యలు వచ్చాయి. వీటిలో మూడు సమస్యలు ఆర్డీవో పరిధిలోనివి కావటంతో వెంటనే పరిష్కరించారు. చాలా వరకు భూమికి సంబంధించినవే ఉన్నాయి. కొవిడ్‌ కేసులు తగ్గేవరకు ఆన్‌లైన్‌ ప్రజావాణినే కొనసాగిస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ కె.సీతారామా రావు, ఆర్డీవో పద్మశ్రీ, ఏవో ప్రేమ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని