logo

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఉత్సవాల సందర్భంగా ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు.

Published : 06 Feb 2023 06:23 IST

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఉత్సవాల సందర్భంగా ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. పోటీలకు ఉభయ తెలుగురాష్ట్రాల పరిధిలోని రైతులు తమ ఎద్దులతో హాజరవగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఏపీలోని నంద్యాల జిల్లా, డోన్‌ ప్రాంతానికి చెందిన గురునాథ్‌ ఎద్దులు విజేతగా నిలువగా రూ.50 వేల నగదు పొందారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలానికి చెందిన పైకం లక్ష్మీనారాయణ ఎద్దులకు రూ.40 వేల నగదు, వనపర్తి జిల్లా పెద్దదగడ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఎద్దులకు తృతీయ బహుమతిగా రూ.30వేల నగదు, ఏపీ రాష్ట్రంలోని అనంతపూర్‌ జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఎద్దులకు నాల్గో బహుమతిగా రూ.20వేల నగదు, జోగులాంబ గద్వాల జిల్లా కంచిపాడు సుధాకర్‌రెడ్డి ఎద్దులకు 5వ బహుమతిగా రూ.10వేల నగదు, ఏపీ రాష్ట్రంలోని అనంతపూర్‌ జిల్లాకు చెందిన కుందన్‌కోట గగన్‌కుమార్‌ ఎద్దులకు ప్రోత్సాహక బహుమతిగా రూ. 5వేల నగదు అందజేశారు. సింగోటం సర్పంచి మండ్ల కృష్ణయ్య, గ్రామప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు