logo

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సృజన

మండల కేంద్రానికి చెందిన కావేటి సృజన జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె విజయం సాధించారు.

Published : 24 Mar 2023 05:22 IST

సృజనకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

లింగాల, న్యూస్‌టుడే: మండల కేంద్రానికి చెందిన కావేటి సృజన జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె విజయం సాధించారు. సృజన పదో తరగతి మహబూబ్‌నగర్‌లో, ఎల్‌ఎల్‌బీని కాకతీయ విశ్వవిద్యాలయంలో, ఎల్‌ఎల్‌ఎం ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. సృజన ఎంపికపై ఆమె తల్లిదండ్రులు నాగరాజు, ప్రమీల హర్షం వ్యక్తం చేశారు. వారిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని