logo

భూ నిర్వాసితులకు అండగా ఉంటా : డీకే అరుణ

గట్టు మండలం చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ధైర్యం కోల్పోవద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 05:44 IST

మాట్లాడుతున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

గట్టు(మల్దకల్‌), న్యూస్‌టుడే : గట్టు మండలం చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ధైర్యం కోల్పోవద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం గట్టు మండలం ఇందువాసిలో భూనిర్వాసితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కోర్టు ద్వారా న్యాయపోరాటం చేద్దామని, అన్ని విధాలుగా వెన్నంటి ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను సాగదీస్తున్నారని, మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన పాలకులు 9 ఏళ్లయినా పూర్తి చేయడం లేదని విమర్శించారు. చిన్నోనిపల్లెలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని