logo

బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు

మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఓ  యువకుడు వివాహం చేసుకున్నాడు.

Published : 27 Mar 2024 02:12 IST

తెలకపల్లి, న్యూస్‌టుడే : మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఓ  యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ నెల 22న బాలిక ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు లేని సమయంలో పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన యువకుడు సలేశ్వరం (22) తెలకపల్లి మండలంలోని గ్రామానికి వచ్చి బలవంతంగా బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని