logo

1.04 లక్ష ఇళ్లలో జ్వర సర్వే పూర్తి

జిల్లాకు కరోనా లక్షణాలు ఉన్న వారికి పంపిణీ చేసేందుకు లక్ష వరకు హోం ఐసోలేషన్‌ (ఔషధాలు) కిట్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి మందుల కిట్లను అందజేశారు.

Published : 25 Jan 2022 01:53 IST

కౌడిపల్లిలో హోంఐసోలేషన్‌ కిట్‌ అందిస్తున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: జిల్లాకు కరోనా లక్షణాలు ఉన్న వారికి పంపిణీ చేసేందుకు లక్ష వరకు హోం ఐసోలేషన్‌ (ఔషధాలు) కిట్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి మందుల కిట్లను అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 1.04 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని, 6768 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గుర్తించి కిట్లను అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం 50 వేల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లనూ సరఫరా చేసిందన్నారు. ఎవరూ కరోనా, ఒమిక్రాన్‌కు భయపడాల్సిన అవసరం లేదని, కాస్త ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వర సర్వేకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రజలు గుమిగూడొద్దని, మాస్కులు ధరించడం మరచిపోవద్దన్నారు. ఆయన వెంటనే స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు వెంకట్‌యాదవ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు