logo

మొలకొస్తున్నా.. మొర వినరా..!

అకాల వర్షాలు.. కర్షకుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి మొలకలు వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మండలం భీంరావుపల్లి పీఏసీఎస్‌ ధాన్యం

Published : 20 May 2022 01:15 IST

అకాల వర్షాలు.. కర్షకుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి మొలకలు వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మండలం భీంరావుపల్లి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లు మొలకెత్తడంతో రైతులు వాటిని వేరు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. నిర్వాహకులు తగినన్ని టార్పాలిన్లు ఇవ్వటం లేదని.. దీంతో అద్దెకు తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. చాలా రోజుల క్రితం ధాన్యం తెచ్చినా తూకం వేయడం లేదని వారు అంటున్నారు. మరోవైపు నార్సింగిలోని న్యూ తిరుమల రైస్‌మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాల వద్ద వడ్లు మొలకెత్తి నారుమడిని తలపిస్తున్నాయి. వర్షానికి ధాన్యం తడవటంతో ఈ పరిస్థితి నెలకొందని నిర్వాహకులు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, నార్సింగి (చేగుంట)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని