logo

చంపేస్తామంటున్నారు.. న్యాయం చేయండి

భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, ఇంటి ఆవరణలో ఉన్న మూత్రశాలను కూలగొట్టారని, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని మెదక్‌ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మౌనిక ఫిర్యాదు చేశారు.

Published : 24 May 2022 02:33 IST


అర్జీదారుడితో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్‌, న్యూస్‌టుడే: భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, ఇంటి ఆవరణలో ఉన్న మూత్రశాలను కూలగొట్టారని, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని మెదక్‌ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మౌనిక ఫిర్యాదు చేశారు. సోమవారం మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావిజ్ఞప్తుల దినం నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వినతులు స్వీకరించారు. తన భర్త నవీన్‌, వాళ్ల అన్నకు మధ్య ఇంటి విషయంలో గొడవలు జరగ్గా, పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ప్రహరీ నిర్మించాలని సూచించడంతో పనులు చేపట్టామన్నారు. చివరకు బాధలు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మౌనిక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్తే తన భర్త అన్న, అతడి భార్య, మూత్రశాల కూలగొట్టి, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని వివరించారు. న్యాయం చేయాలని ఎస్పీని విన్నవించారు. భూమిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని మాసాయిపేట మండలం నడిమి తండాకు చెందిన మెగావత్‌ గణేశ్‌ అర్జీ ఇచ్చారు. మొత్తం 8.10 ఎకరాలు పెద్ద అన్న నాలుగెకరాలు, రెండో అన్న, తల్లి పేరిట రెండెకరాల చొప్పున ఉందని, తనకు రావాల్సిన భూమి ఇవ్వమంటే గొడవ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు