logo

84 ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం

గౌరవెల్లి రిజర్వాయరు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. భూసేకరణలో మిగిలిపోయిన 84 ఎకరాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌.. అవార్డు పాస్‌ చేసినట్లు హుస్నాబాద్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. రైతులకు పరిహారం చెక్కుల జారీ

Published : 03 Jul 2022 01:37 IST

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: గౌరవెల్లి రిజర్వాయరు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. భూసేకరణలో మిగిలిపోయిన 84 ఎకరాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌.. అవార్డు పాస్‌ చేసినట్లు హుస్నాబాద్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. రైతులకు పరిహారం చెక్కుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు. గత వారం 53 మంది రైతులకు సంబంధించి అవార్డు ఎంక్వైరీ నిర్వహించారు. ఈక్రమంలో రైతులు అవార్డు ఎంక్వైరీ చేయవద్దంటూ అభ్యంతరం తెలిపారు. వాటిని పరిశీలించిన కలెక్టర్‌ అవార్డు పాస్‌ చేసి భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టారు. దీంతో సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. పరిహారం పొందడానికి వారం రోజుల్లో తమ కార్యాలయంలో సంప్రదించి.. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ పరిహారం సమ్మతంగా లేకపోతే చెక్కును తీసుకుని.. అధిక పరిహారం కోసం విన్నవించుకుంటే సెక్షన్‌ 64 ప్రకారం భూసేకరణ పునరుపాధి, పునరావాస అథారిటీకి పంపుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని