logo

భగీరథ మోటార్ల బిగింపు షురూ..

మిషన్‌ భగీరథ పథకానికి నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం మల్లన్నసాగర్‌ వద్ద చేపడుతున్న శుద్ధి  ప్లాంటు నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. కొండపాక మండలం తిప్పారం వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్‌వెల్‌ వద్ద 1.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటర్ల బిగింపు పనులు ప్రారంభమయ్యాయి.

Published : 03 Oct 2022 00:45 IST

న్యూస్‌టుడే, గజ్వేల్‌: మిషన్‌ భగీరథ పథకానికి నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం మల్లన్నసాగర్‌ వద్ద చేపడుతున్న శుద్ధి  ప్లాంటు నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. కొండపాక మండలం తిప్పారం వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్‌వెల్‌ వద్ద 1.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటర్ల బిగింపు పనులు ప్రారంభమయ్యాయి. రూ.1212 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా 65 శాతం పనులు పూర్తయినట్లు మిగిలినవి పూర్తి చేసి వచ్చే డిసెంబరు నుంచి మార్చిలోగా సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను మంగోలులోని ట్రీట్‌మెంట్‌ ప్లాంటు వరకు అక్కడి నుంచి జిల్లాలకు తరలించేందుకు రెండు చోట్ల ఆరు మోటార్ల చొప్పున మొత్తం 12 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో చోట నాలుగు పంపులను వినియోగిస్తారు. మిగతావి అత్యవసరంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఈ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మొతం 110 కిలోమీటర్ల పైప్‌లైన్‌ ఉంటుంది. రిజర్వాయర్‌ నుంచి ఏటా 30 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోనున్నారు. పనులను సాధ్యమైంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు పథకం ఫలాలు అందేలా చూస్తామని మిషన్‌ భగీరథ ఈఈ రాజయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని