logo

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పాటించి సజావుగా నిర్వహించాలని డీఆర్డీవో అదనపు పీడీ విరోజ స్పష్టంచేశారు.

Published : 03 Feb 2023 01:03 IST

వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఆర్డీవో అదనపు పీడీ విరోజ, తదితరులు

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పాటించి సజావుగా నిర్వహించాలని డీఆర్డీవో అదనపు పీడీ విరోజ స్పష్టంచేశారు. గురువారం పాపన్నపేటలో ఉపాధిహామీ పనులపై 12వ విడత సామాజిక ప్రజాదర్బారు నిర్వహించారు. 2019 అక్టోబరు నుంచి 2022 మార్చి వరకు జరిగిన పనుల తీరుపై పరిశీలించారు. రూ.13.98 కోట్ల విలువైన పనులు జరుగగా, కూలీలకు రూ.11.76 కోట్లు చెల్లించారు. వస్తుసామగ్రికి రూ.2.16 కోట్లు వెచ్చించారు. రూ.4.12 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. దీన్ని రికవరీ చేయడంతో పాటు రూ.47,300 జరిమానా విధించారు. అనంతరం డీఆర్డీవో అదనపు పీడీ మాట్లాడుతూ.. ఉపాధిహామీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవకతవలు అరికట్టేందుకు సామాజిక తనీఖీలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. డీవీవో శ్రీహరి, ఏపీడీ బాలయ్య, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఏపీవో శ్వేత, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని