logo

‘చిరు వ్యాపారంతో పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు’

కృషి, పట్టుదల ఉంటే భవిష్యత్తులో చిరు వ్యాపారంతో పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని పాలనాధికారి రాజర్షి షా విద్యార్థులకు సూచించారు.

Updated : 30 Mar 2023 04:18 IST

మాట్లాడుతున్న పాలనాధికారి రాజర్షి షా, ప్రతిమాసింగ్‌ తదితరులు

మెదక్‌ టౌన్‌: కృషి, పట్టుదల ఉంటే భవిష్యత్తులో చిరు వ్యాపారంతో పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని పాలనాధికారి రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఫెడరేషన్‌ ఛాంబర్స్‌ అండ్‌ కామర్స్‌ ఇండస్ట్రీస్‌, వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీస్‌ హైదరాబాద్‌ వారు సంయుక్తంగా నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రాం శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సలహాలు, సూచనలు, శిక్షణ కోసం పరిశ్రమలశాఖను సంప్రదించాలన్నారు. చిన్న వస్తువులకు మెదక్‌ మాంజీరా మార్కెటింగ్‌ గ్రూప్‌ ద్వారా విక్రయ సౌకర్యం కల్పిస్తామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ విద్యార్థులకు భరోసా కల్పించారు. అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తెలంగాణ ఛాంబర్స్‌ అధ్యక్షులు అనిల్‌ అగర్వాల్‌ ప్రిన్సిపల్‌ గణపతి, రాకేష్‌ సింగ్‌, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని