logo

పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సంక్రాంతి తరువాత జిల్లాలో వరసగా రెండు రోజుల్లో భారీ స్థాయిల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య పెరిగింది. సోమవారం 128

Published : 19 Jan 2022 04:35 IST

ఒక్క రోజులో 198 మందికి పాజిటివ్‌

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సంక్రాంతి తరువాత జిల్లాలో వరసగా రెండు రోజుల్లో భారీ స్థాయిల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య పెరిగింది. సోమవారం 128 పాజిటీవ్‌ కేసులు నమోదుకాగా మంగళవారం ఒక్క రోజే 198 మందికి కొవిడ్‌ పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెపుతున్నాయి. జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు కొవిడ్‌ పరీక్షల కోసం జనరల్‌ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యల్లో వరుస కడుతున్నారు. కొవిడ్‌ లక్షణాలతో మంగళవారం జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్న వారు 3,618 మంది ఉన్నారు. పాజిటీవ్‌ రేటు 5.8శాతానికి చేరింది. పాజిటీవ్‌ ఉన్నవారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొవిడ్‌ కిట్లు ఇచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచిస్తున్నారు. లక్షణాలు తీవ్రస్థాయిల్లో ఉన్నవారిని గుర్తించి జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డులకు పంపుతున్నారు. అయితే కొవిడ్‌ లక్షణాలు ఉన్నా లెక్క చేయకుండా ఎక్కువ శాతం మంది  జనాల్లోనే తిరుగుతున్నారు. కొవిడ్‌ పాజిటీవ్‌ ఉన్నవారికి గతంలో చేతికి ప్రత్యేకంగా ముద్రలు వేసి ఐసోలేషన్‌కు పరిమితం చేసేవారు. ప్రస్తుతం అలాంటి జాగ్రత్తలు తీసుకోని కారణంగా కొవిడ్‌ పాజిటీవ్‌ కొందరు బయట తిరుగుతున్నారు. దీంతో ఇతరులకు కొవిడ్‌ సోకేలా కారకులవుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిని గుర్తించి పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నా.. అనుకున్న స్థాయిల్లో మార్పులు రావడం లేదు. నిర్లక్ష్యం వీడి కొవిడ్‌, ఒమిక్రాన్‌పై ఇప్పటికైనా సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
    
  12-14 ఏళ్ల పిల్లలకు టీకాలు
నల్గొండ అర్బన్‌: జిల్లాలో మార్చి నెల నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ వయసులో ఉన్న పిల్లలు జిల్లాలో 14,530 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వయసు పిల్లలు 90శాతానికి పైగా పాఠశాలలోనే ఉండటంతో విద్యాసంస్థల్లోనే టీకా వేయాలా, తల్లిదండ్రుల అనుమతితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సమన్వయ శాఖల అధికారులతో ఒకటీ రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిల్లో కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రుల అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా సరఫరా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని