logo

ఏ బస్సుకు ఎంత టిక్కెట్టో ఎలా తెలిసేది?

నల్గొండకు చెందిన మంజుల హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం నల్గొండకు వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళుతుంటారు. ఉదయం నాన్‌స్టాప్‌ బస్సుకోసం క్యూలో నిలబడి టిక్కెట్‌కు రూ.500 నోటు ఇచ్చారు.

Published : 27 May 2022 03:06 IST

నల్గొండ బస్టాండ్‌లోని బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ఛార్జీల వివరాలు చెరిపేసిన ఛార్జు

నల్గొండకు చెందిన మంజుల హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం నల్గొండకు వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళుతుంటారు. ఉదయం నాన్‌స్టాప్‌ బస్సుకోసం క్యూలో నిలబడి టిక్కెట్‌కు రూ.500 నోటు ఇచ్చారు. చిల్లర తెమ్మని బుకింగ్‌ క్లర్కు అన్నారు. చిల్లర కోసం పక్కకు వెళ్లి వచ్చి మళ్లీ వరసలో నిలబడాల్సి వచ్చింది. ఈ సమస్య మంజుల ఒకరిదే కాదు చాలా మందిది.

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

నల్గొండ బస్టాండ్‌లోని హైదరాబాద్‌ నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద ఛార్జీల ఛార్టు ఏర్పాటు చేసేవారు. ఇటీవల తరచూ ఛార్జీలు పెరగడంతో ఛార్టు తొలగించారు. తర్వాత దాని  గురించి అధికారులు పట్టించుకోలేదు. నల్గొండ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నాన్‌ స్టాప్‌ సర్వీసులుగా నడుపుతారు. రోజు 260 ట్రిప్పులు హైదరాబాద్‌కు నడుస్తాయి. దీనికి ఎంత ఛార్జీ అనేది ప్రయాణికులకు తెలియదు. సోమవారంతో పాటు సెలవుల తర్వాత రోజు హైదరాబాద్‌ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక్క బస్సుకు టిక్కెట్లు ఇస్తే కౌంటర్‌ ముందు రెండు, మూడు బస్సులకు సరిపోను మంది ప్రయాణికులు వరుసలో నిలబడుతుంటారు. ఛార్జీలకు సరిపడా చిల్లర తెచ్చుకుంటేనే టిక్కెట్‌ ఇస్తామని కౌంటర్‌ సిబ్బంది చెబుతున్నారు. ఏ బస్సు ఛార్జీ ఎంతనో తెలియదు. కౌంటర్లలో నిలబడిన ప్రయాణికులకు బుకింగ్‌ క్లర్క్‌ చిల్లర తేవాలని సూచించడంతో అవి తీసుకుని వస్తే మళ్లీ క్యూలో చివరిగా నిలబడాల్సి వస్తోంది. హైదరాబాద్‌ ఛార్జీల వివరాలు ఛార్టు ఏర్పాటు చేస్తే ప్రయాణికులు సరిపడా డబ్బులు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది.
ఛార్టు ఏర్పాటు చేస్తాం.. రవి, స్టేషన్‌ మాస్టర్‌, నల్గొండ బస్టాండ్‌
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సరిపడా చిల్లర తెచ్చుకునేలా ఛార్జీల వివరాల ఛార్టు వెంటనే ఏర్పాటు చేస్తాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని