logo

ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం: సంకినేని

తెరాస  అధికారం కోసం ఎన్నికల సమయంలో చేసిన హామీలు, మేనిఫెస్టోలు అధికారంలోకి వచ్చాక గుర్తుకురావని తిరిగి ఎన్నికలు వస్తేనే అవి గుర్తుకువస్తాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంటేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 25 Sep 2022 06:26 IST

నూతనకల్‌లో భాజపా నాయకులతో కలిసి మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వరరావు

నూతనకల్‌, న్యూస్‌టుడే : తెరాస  అధికారం కోసం ఎన్నికల సమయంలో చేసిన హామీలు, మేనిఫెస్టోలు అధికారంలోకి వచ్చాక గుర్తుకురావని తిరిగి ఎన్నికలు వస్తేనే అవి గుర్తుకువస్తాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంటేశ్వరరావు పేర్కొన్నారు. నూతనకల్‌లో శనివారం ఆపార్టీ కార్యకర్తలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన హామీలు, జీవోలు ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నాయని రాష్ట్రం మొత్తం అమలు చేయాల్సిన పథకాలు ఉప ఎన్నికలు జరిగే ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యాదవుల నుంచి డీడీలు తీసుకుని నేటివరకు రెండోవిడత గొర్రె పిల్లలను అందించడంలేదని ఆయన గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని వాటిని ప్రజలు తిప్పికొట్టి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.  కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్య, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు అసెంబ్లీ కన్వీనర్‌ కాప రవికుమార్‌, భూతం సాగర్‌, హబీద్‌, మల్లెపాక సాయిబాబ, కొత్తపల్లి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని