logo

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి: జడ్జి

న్యాయసేవాధికార సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు వి.బాలభాస్కరరావు అన్నారు.

Published : 07 Feb 2023 06:22 IST

లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టంను ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి బాలభాస్కరరావు, చిత్రంలో న్యాయమూర్తులు మారుతిదేవి, దశరథరామయ్య తదితరులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: న్యాయసేవాధికార సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు వి.బాలభాస్కరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలిసి ‘లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం’ న్యాయమూర్తి ప్రారంభించారు. అంతకుముందు వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భుయాన్‌, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, జిల్లా పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి జస్టిస్‌ మాధవి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఈ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ ద్వారా అర్హులైన కక్షిదారులు ఉచిత న్యాయసలహాలు, సేవలు పొందవచ్చునన్నారు. డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా న్యాయవాది శంకర్‌ను నియమించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.దశరథరామయ్య, ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతిదేవి, న్యాయమూర్తులు నాగేశ్వరరావు, కవిత, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీ రాజేష్‌చంద్ర, జీపీ అంజయ్య, పీపీ శ్రీనివాస్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేశవరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు