logo

ఇంటికే పోషకాహారం..!

అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని శత శాతం తినేలా చూడాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated : 03 Dec 2022 03:59 IST

కేంద్రాలకు రాలేని గర్భిణులు, బాలింతల చెంతకు భోజనం

అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం తింటున్న చిన్నారులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని శత శాతం తినేలా చూడాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  గతంలో ఉన్న నిబంధనలు సడలించి ప్రతి ఒక్కరికీ పోషకాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగిన విధంగా చర్యలు చేపట్టారు. కేంద్రాలకు రాలేని వారి వివరాలను సేకరించి వారి ఇంటి వద్దకే పోషకాహారాన్ని అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

న్యూస్‌టుడే, దుత్తలూరు, కొండాపురం

జిల్లాలో మొత్తం 2,934 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.  చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం వండి వడ్డించేవారు.  కరోనా మహమ్మారి రావడంతో కేంద్రాలన్నీ మూతపడ్డాయి.  కేంద్రాలు తెరిచిన తరువాత చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నా గర్భిణులు, బాలింతలకు ఇంటికి సరకులను అందజేసేవారు.  జులై నుంచి కేంద్రాల్లోనే గర్భిణులు, బాలింతలకు కేంద్రాల్లోనే వండి పోషకాహారం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.  వివిధ కారణాలతో కేంద్రాల్లో భోజనం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీంతె కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  అలాంటి వారికి ఇప్పటిదాకా కేంద్రాల కార్యకర్తలు అనధికారికంగా వండిన, సరకులను లబ్ధిదారులకు ఇచ్చేవారు. రోజూ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా కేంద్రాల్లో భోజనం చేసిన వారి వివరాలు యాప్‌లో నమోదు చేసినపుడు భోజనం చేయని వారి గురించి ఉన్నతాధికారులు ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాలు దూరంగా ఉండటంతో పాటు 8-10 నెలల గర్భిణులు, ఒకటి నుంచి మూడు నెలల లోపు బాలింతలు నడిచి కేంద్రాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇక నుంచి కేంద్రాల్లో వండిన ఆహారాన్ని వారి ఇళ్లకు పంపించాలని సూచించింది. కేంద్రాలకు వచ్చిన వారికి పోషకాహారం పెట్టాలని, రానివారికి ఇళ్లకు పంపించాలని ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశించారు. కేంద్రాల కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారులతో పాటు చిన్నారులకు పోషకాహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సద్వినియోగం చేసుకోవాలి
- సౌజన్య, ఇన్‌ఛార్జి పీడీ, ఐసీడీఎస్‌

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు వంద శాతం మందికి పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రాజెక్టులు  సీడీపీవోలు, అంగన్‌వాడీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇక నుంచి కేంద్రాలకు రాలేని గర్భిణులు, బాలింతలకు వారి కుటుంబ సభ్యులొస్తే బాక్సుల్లో అన్నం, కూరలు పెట్టి ఇస్తారు. ఈ అవకాశాన్ని కేంద్రాలపరిధిలోని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని