logo

ప్రైవేట్‌కు ఘన వ్యర్థ్యాల నిర్వహణ

చెత్త నిర్వహణ ప్రైవేట్‌ ఏజెన్సీలు చేపట్టనున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాల్లో దీన్ని ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో కావలి పురపాలక సంఘం కూడా ఒకటి.

Updated : 09 Feb 2023 02:40 IST

న్యూస్‌టుడే, కావలి: చెత్త నిర్వహణ ప్రైవేట్‌ ఏజెన్సీలు చేపట్టనున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాల్లో దీన్ని ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో కావలి పురపాలక సంఘం కూడా ఒకటి.

* ప్రస్తుతం పురపాలక పరిధిలో వెలువడే చెత్తను పునర్వినియోగం చేయకపోగా సంపద సృష్టి కూడా చేయడం లేదు. దీంతో కొండలను తలపించేలా పేరుకుపోతుంది. తడి వ్యర్ధాలను వర్మికంపోస్టు తయారీకి, పొడి చెత్తను విద్యుత్తు ఉత్పత్తి, సిమెంట్‌ తయారీ కర్మాగారాలకు తరలించేలా ప్రణాళికను రూపొందించారు. జిల్లా యూనిట్‌గా నెల్లూరులో వివిధ మున్సిపాలిటీల నుంచి పొడి చెత్త తరలింపునకు రూపొందించిన వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ నిర్వహణ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఊసే లేదు. ఎట్టకేలకు వ్యర్థాల నిర్వహణకు సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.


ఆదేశాలతో కార్యాచరణ

శ్రీనివాసులురెడ్డి, ఏఈ, కావలి

ప్రైవేట్‌ ఏజెన్సీలతో చెత్త నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు రాలేదు.  కంపోస్టు యార్డులోనే వారికి అవసరమైన స్థలాన్ని ఇస్తాం. పురపాలక పరిధిలో శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. వ్యర్థాల పునర్వినియోగానికి కలిసొచ్చే వారితో సమన్వయంగా పనిచేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని