logo

సహాయ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ చర్చనీయాంశం

దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ చర్చనీయాంశంగా మారింది. శనివారం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒంగోలు ఏసీగా బదిలీ అయ్యారు.

Published : 04 Jun 2023 02:56 IST

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ చర్చనీయాంశంగా మారింది. శనివారం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒంగోలు ఏసీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సహాయకమిషనర్‌గా నియమితులైన జె.శ్రీనివాసరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వతంత్రంగా స్వీకరించారు. బదిలీ అయిన పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి అందుబాటులో లేకపోవడంతో నేరుగా కార్యాలయానికి వచ్చి ఆయన బాధ్యతలు చేపట్టడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన జిల్లా సహాయ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఏసీగా బాధ్యతలు చేపట్టారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని