logo

భూ సేకరణలో ఆలస్యమెందుకు?

జిల్లాలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసేందుకు ఇంకా ఆలస్యమెందుకు అని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రశ్నించారు.

Published : 07 Jun 2023 04:33 IST

ఇరిగేషన్‌ అధికారులతో కలెక్టర్‌

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: జిల్లాలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసేందుకు ఇంకా ఆలస్యమెందుకు అని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రశ్నించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో జేసీ కూర్మనాథ్‌తో కలసి ఆయన ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ ఫేస్‌ 1, 2లకు సంబంధించిన భూసేకరణ వేగవంతగా చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. గడువు ప్రకారం ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో సమన్వయ పరుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ హరినారాయణరెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

డిమాండున్న కోర్సుల్లోనే శిక్షణ ఇవ్వండి.. : మార్కెట్ల్‌ో ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సుల్లోనే యువతకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన ఛాంబర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న వృత్తి విద్య కోర్సులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖాధికారి వినిల్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రెడ్డి, జేఈవో భవానిశంకర్‌ పాల్గొన్నారు.

పిల్లల వివరాలు సిద్ధం చేయాలి.. : జిల్లాలో 6 నుంచి 18 ఏళ్ల పిల్లల డేటా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌.. సర్వశిక్ష అభియాన్‌, ఐసీడీఎస్‌, వైద్యశాఖల అధికారులకు సూచించారు. ఆ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని