logo

మహిళా రైతు ఆత్మహత్య

చేపల చెరువుల సాగుతో భారీగా అప్పులు అవటంతో వాటిని ఎలా తీర్చాలో అర్థంకాక మనోవేదనకు గురైన ఒక మహిళా రైతు ఆత్మహత్యకు గురయ్యారు.

Published : 16 Apr 2024 02:51 IST

జండాదిబ్బ(సంగం), న్యూస్‌టుడే: చేపల చెరువుల సాగుతో భారీగా అప్పులు అవటంతో వాటిని ఎలా తీర్చాలో అర్థంకాక మనోవేదనకు గురైన ఒక మహిళా రైతు ఆత్మహత్యకు గురయ్యారు. జండాదిబ్బ పంచాయతి అనుబంధ గ్రామమైన అరవపాళెంలో గత మూడేళ్ల నుంచి మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని బలే శశిరేఖ(37) భర్త నాగరాజుతో కలసి చేపల చెరువు సాగు చేపట్టారు. సాగులో ఆదాయం రాకపోగా రూ.20 లక్షల అప్పులు మిగిలాయి.వాటిని ఎలా చెల్లించాలంటూ ఆవేదన చెందుతున్న శశిరేఖ ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెల్లూరుకి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.నాగార్జునరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని