logo

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా

చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్‌ అతని అనుచరులు పార్టీలో చేరారు.

Published : 18 Apr 2024 03:17 IST

 

వింజమూరు: తెదేపాలో చేరుతున్న వైకాపా కో-ఆప్షన్‌ సభ్యులు రఫి

బిట్రగుంట, న్యూస్‌టుడే : చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్‌ అతని అనుచరులు పార్టీలో చేరారు. వీరికి రవిచంద్ర, కావలి తెదేపా అభ్యర్థి వెంకట కృష్ణారెడ్డి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో  నాయకులు రవికుమార్‌ చౌదరి, మధుబాబునాయుడు, ఎం.నాగేశ్వరావు, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కావలి : తెదేపాతోనే రామరాజ్యం వస్తుందని ఆ పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ వస్త్ర సముదాయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి

వింజమూరు : ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యమని ఎమ్మార్పీఎస్‌ నాయకులు తెలిపారు. స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ప్లాజాలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు జి. శ్రీనివాస్‌ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలన్నారు. పి. అంబేడ్కర్‌, ఎం. తిరుమలేసు, జి. వెంకటేశ్వర్లు, ఎం. సుజాత తదితరులు పాల్గొన్నారు.

వరికుంటపాడు: నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించడమే ధ్యేయమని తెదేపా అభ్యర్థి కాకార్ల సురేష్‌ తెలిపారు. మండలంలోని జడదేవి, తూర్పుచెన్నంపల్లె, అలివేలిమంగాపురం, తూర్పుబోయమడుగుల, గువ్వాడి, కాంచెరువు, ఇస్కపల్లె, నల్లబోతులవారిపల్లె, జి.కొండారెడ్డిపల్లెలో బుధవారం చండ్రా మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జి.గోపి, కె.శ్రీనివాసులు, పి.పుల్లయ్య,  పాల్గొన్నారు. వింజమూరు : వైకాపాకు చెందిన మండల కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ రఫి బుధవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు జి.రఘునాథరెడ్డి, జి. నరసారెడ్డి, సీహెచ్‌. వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

సీతారామపురం: మండలంలో కొన్ని పోలింగు కేంద్రాల్లో రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో వైకాపా నాయకులు ఉన్నారని ఉదయగిరి నియోజకవర్గ తెదేపా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు సందిరెడ్డి రామారావు తెలిపారు. ఇదేవిషయమై ఉదయగిరి ఆర్వోకు, ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తెదేపా ఇంటింటి ప్రచారం

కందుకూరు పట్టణం : సామాన్య, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంటూరి నాగేశ్వరరావు అని, ఆయనకు పేదల బాధలు బాగా తెలుసని ఇంటూరి సౌజన్య అన్నారు. పట్టణంలోని 6వ వార్డు కోటకట్టవీధి, మక్కామసీదు ప్రాంతంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు డి.మల్లేశ్వరరావు, సయ్యద్‌ అహ్మద్‌బాషా, షేక్‌ మున్నా, ఫిరోజ్‌, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని