logo

జగదభిరామ.. జానకిరామ

జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు.

Published : 18 Apr 2024 03:39 IST

వేడుకగా సీతారాముల కల్యాణం

కల్యాణమూర్తిగా స్వామివారు.. తిలకిస్తున్న భక్తులు

నెల్లూరు(సాంస్కృతికం): జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని కనులపండువగా జరిపించారు. 1వ అదనపు కోర్టు న్యాయమూర్తి కపర్థి, గాయత్రి దంపతులు, తెలుగుగంగ విశ్రాంత ఎస్‌ఈ హరినారాయణరెడ్డి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తితిదే కల్యాణ మండపంలో భక్తులకు భోజనాలు పెట్టారు. మందిర ఛైర్మన్‌ చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగిన కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న న్యాయమూర్తి, అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని