logo

ఏకకాలంలో రుణమాఫీ

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మొదట రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ , శేరిబీబీపేటలో సోమవారం ఏర్పాటు చేసిన రచ్చబండలో

Published : 24 May 2022 03:45 IST

శేరిబీబీపేటలో మహిళల సమస్యలు వింటున్న మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలీ

బీబీపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మొదట రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ , శేరిబీబీపేటలో సోమవారం ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండావిష్కరించారు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు పంజాబరైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ మన సొమ్ము ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో మరణించిన కర్షకుల కుటుంబాలకు ఏం సాయం చేశారో చెప్పాలన్నారు. అనంతరం బీబీపేటలో ఓ ఆలయ వార్షికోత్సవానికి, తెరాస సీనియర్‌ నాయకుడు బాశెట్టి నాగేశ్వర్‌ కుమారుడి వివాహం, తుజాల్‌పూర్‌ లో నామకరణ వేడుకల్లో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణరెడ్డి, మండలాధ్యక్షుడు సుతారి రమే, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమాగౌ, ఇరు గ్రామాల పార్టీ అధ్యక్షులు పరశురాములు, సాదుల నాగరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని