logo

అంధుడికి అండగా..ప్రతి నెలా రూ.2 వేలు పంపిణీ

‘వంద శాతం వైకల్యముంది.. అయినా పింఛను రాకుంది’ శీర్షికన ఈనాడు ప్రధాన సంచికలో ఈ నెల 23న గురువారం ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు, దాతలు స్పందించారు. నల్గొండకు చెందిన సత్యసాయి భక్తురాలు, డాక్టర్‌ సువర్ణ జైపాల్‌రెడ్డి

Published : 24 Jun 2022 06:11 IST

ఈనాడు-నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

బాధిత కుటుంబానికి నగదు అందజేత (అంతర చిత్రంలో.. దాత డాక్టర్‌ సువర్ణ జైపాల్‌రెడ్డి)

‘వంద శాతం వైకల్యముంది.. అయినా పింఛను రాకుంది’ శీర్షికన ఈనాడు ప్రధాన సంచికలో ఈ నెల 23న గురువారం ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు, దాతలు స్పందించారు. నల్గొండకు చెందిన సత్యసాయి భక్తురాలు, డాక్టర్‌ సువర్ణ జైపాల్‌రెడ్డి అంధుడి కుటుంబానికి ప్రతి నెల రూ.2 వేలు అందించడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పింఛన్‌ మంజూరయ్యే వరకు తన వంతుగా సాయం చేస్తానన్నారు. ఈ మేరకు గురువారం బాధిత కుటుంబానికి రూ.2 వేలు అందజేశారు. ఇదే అంశంపై పాలనాధికారి నారాయణరెడ్డి సెర్ప్‌ సీఈవోకు లేఖ రాశారు. ‘నిరుపేద.. కళ్లు కనిపించవు.. జీవితం దుర్భరంగా ఉంది.. ఇలాంటి వ్యక్తికి మానవతా  దృక్ఫథంతో స్పందించి ఆసరా పింఛన్‌ ఇవ్వాలని’ అందులో పేర్కొన్నారు. జిల్లాజడ్జి కుంచాల సునీత కూడా బాధితుడి  పరిస్థితిపై ఆరా తీశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని