దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
నియోజకవర్గంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అధికారులకు సూచించారు.
అధికారులతో సమీక్షిస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్
బోధన్ గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అధికారులకు సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, పుర కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ వరప్రసాద్‌తో పాటు మండలస్థాయి అధికారులతో ఉత్సవాల నిర్వహణపై గురువారం తన నివాసంలో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 22 వరకు నిర్వహించే కార్యక్రమాల అమలును పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు సాయం
బోధన్ గ్రామీణం, న్యూస్‌టుడే: భారాసలో పనిచేసి మృతిచెందిన పలువురు కుటుంబాలకు ఎమ్మెల్యే షకీల్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పాలేవార్ సాయినాథ్, మావందిఖుర్దు మాజీ సర్పంచి రాజు, సాలూరకు చెందిన అనిత అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. సాయినాథ్ కుటుంబానికి రూ.లక్ష, మరో ఇద్దరికి రూ.50వేల చొప్పున ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలకు గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదు అందజేశారు. బెల్లాల్ గ్రామానికి చెందిన వరమ్మ మృతి చెందగా ఆమె కుటుంబానికి పార్టీ పరంగా మంజూరైన బీమా సొమ్ము రూ.2లక్షలు అందించారు. కార్యక్రమంలో భారాస నాయకులు గంగారెడ్డి, బుద్దె రాజేశ్వర్, రవీందర్‌యాదవ్, శరత్, నర్సయ్య, సంజీవ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
అభంగపట్నం (నవీపేట), న్యూస్‌టుడే: అభంగపట్నానికి చెందిన సాదుల సంతోష్ గతేడాది స్థానిక చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బాధితుడికి రూ.2 లక్షల భారాస ప్రమాద బీమా చెక్కు మంజూరు కాగా బోధన్‌లోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే షకీల్ గురువారం ఆ చెక్కు అందజేశారు. ఎంపీపీ శ్రీనివాస్, నవీపేట సొసైటీ ఛైర్మన్ అబ్బన్న, సతీష్, ఉమర్, అప్సర్, అలీం, సురేష్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు