logo

‘అవినీతికి చిరునామా కాంగ్రెస్‌’

అవినీతికి చిరునామా కాంగ్రెస్‌ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Published : 28 Mar 2024 03:33 IST

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: అవినీతికి చిరునామా కాంగ్రెస్‌ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌, భాజపాలు అవినీతి కవల పిల్లలుగా అభివర్ణించారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఏ ఒక్క ఆడబిడ్డకు ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. బెదిరింపులకు పాల్పడుతూ తమ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భాజపా చెప్పినట్లు వినకుంటే ఈడీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి ఓడిన నాయకుడు అధికారులను భయపెట్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని కుంటుపడేలా చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌ స్థానం నుంచి భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ గెలుపు ఖాయమన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సుజీత్‌సింగ్‌ ఠాకూర్‌, రవిచందర్‌, మధుకర్‌రావు, ప్రభాకర్‌, ప్రేమ్‌దాస్‌, సత్యం, మహేష్‌, సాగర్‌, జడ్పీటీసీ సభ్యురాలు సుమలత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని