logo

ఆధారాలు చూపిస్తే నగదు వాపస్‌

పార్లమెంట్‌ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు

Published : 29 Mar 2024 05:23 IST

రూ.50 వేల కంటే ఎక్కువ తరలించొద్దు

కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధితులతో మాట్లాడుతున్న జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ ఛైర్మన్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకుంటే అధికారులు జప్తు చేస్తారని జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. నగదు తిరిగి ఇచ్చేందుకు అదనపు పాలనాధికారి(రెవెన్యూ) ఛైర్మన్‌గా జిల్లాస్థాయి గ్రీవెన్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌, జిల్లా కోశాధికారి కమిటీ సభ్యులు ఉంటారని వివరించారు. రూ.10 లక్షల లోపు నగదు, బంగారం, వెండి ఇతర వస్తువులకు సంబంధించి ఆధారాలను కమిటీకి చూపించాలని, అన్ని సక్రమంగా ఉంటే వాటిని విడుదల చేస్తారని చెప్పారు. పట్టుబడిన నగదు రూ.10 లక్షలకు మించి ఉంటే ఆ వివరాలు ఆదాయ పన్ను విభాగం నోడల్‌ అధికారికి పంపించి వారు పరిశీలన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటే విడుదల చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు కాగా, ఇందులో ఒక కేసుకు సంబంధించి రూ.50,020 నగదుకు సంబంధించి ఆధారాలు చూపించడంతో విడుదల చేసినట్లు తెలిపారు. సంబంధిత పత్రాలతో కలెక్టరేట్‌లోని నోడల్‌ అధికారి పల్లె పాపయ్య (79975 90472)ను సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని