logo

గురువు మరణ వార్త విని.. 600 కిలోమీటర్ల పాదయాత్ర

ఢెంకనాల్‌ జిల్లా జోరంద నుంచి దాదాపు 600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి, నవరంగపూర్‌ జిల్లా జొరిగావ్‌ సమితి దొడ్రలో ఉన్న ఆశ్రమానికి ఆదివారం ఉదయం ఇంద్రమణి బాబా తన శిష్య బృందంతో చేరుకున్నారు.

Published : 27 Mar 2023 01:58 IST

ఇంద్రమణ బాబా తన శిష్యులతో..

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: ఢెంకనాల్‌ జిల్లా జోరంద నుంచి దాదాపు 600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి, నవరంగపూర్‌ జిల్లా జొరిగావ్‌ సమితి దొడ్రలో ఉన్న ఆశ్రమానికి ఆదివారం ఉదయం ఇంద్రమణి బాబా తన శిష్య బృందంతో చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దొడ్ర ఆశ్రమానికి చెందిన ధనుంజయ్‌ బాబా శిష్యుడు ఇంద్రమణిబాబా జోరుదలో ఫిబ్రవరిలో జరిగిన మాఘమేళాకు పాదయాత్రగా డిసెంబర్‌ 29న బయలుదేరి, జనవరి 29న చేరుకున్నారు. అక్కడ వివిధ సభల్లో పాల్గొని, మేళాను దర్శించుకొని కొన్ని నెలలు ఆశ్రమ పద్ధతులను బోధించి తిరిగి వస్తానని అనుకున్న ఇంద్రమణిబాబా హఠాత్తుగా ఫిబ్రవరి 25న గురువు ధనుంజయ్‌ బాబా మరణ వార్త విన్నారు. వెంటనే పాదయాత్ర ప్రారంభించి 30 రోజుల నడిచి ఆదివారం నాటికి ఆశ్రమానికి చేరుకున్నారు. ఇంద్రమణి బాబా మీడియాతో మాట్లాడుతూ.. తన గురువు మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. వెంటనే తన గురువు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని, ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తు బాధ్యతలు చూసుకుంటానని పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్‌, డిగ్రీ కళాశాల స్థాపన కోసం ధర్మానుసారంగా ఉద్యమిస్తానని తెలిపారు.

పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న బాబా శిష్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని