logo

బొబ్బిలి వీణలకు భలే గిరాకీ

చారిత్రక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు గిరాకీ పెరిగింది. విశాఖలో గత నెలలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌కు ఇక్కడి నుంచి బహుమతి వీణలు వెళ్లగా..

Published : 27 Mar 2023 03:54 IST

తరలి వెళ్లిన గిఫ్ట్‌వీణలు

బొబ్బిలి, న్యూస్‌టుడే: చారిత్రక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు గిరాకీ పెరిగింది. విశాఖలో గత నెలలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌కు ఇక్కడి నుంచి బహుమతి వీణలు వెళ్లగా.. నేటి నుంచి జరగనున్న జి-20 సదస్సుకు కూడా సుమారు 200 వీణలు బొబ్బిలి కేంద్రం నుంచి వెళ్లాయి. దీంతో వాటికి మరింత ప్రాచుర్యం దక్కింది. ఈ సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి నిర్వాహకులు ఆహ్వానం పలికి ఈ వీణలను బహూకరించనున్నారు. లేపాక్షి ఆధ్వర్యంలో కొనుగోలు చేసి తరలించారు. బొబ్బిలి వీణతో కచేరిని కూడా సదస్సులో ఏర్పాటు చేయనుండడంతో కళాకారుడు సర్వసిద్ధి లక్ష్మణరావు, కేంద్రం ఇన్‌ఛార్జి రామకృష్ణ వెళ్లారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. గ్లోబల్‌ సమ్మిట్లోనూ కచేరి నిర్వహించారు. నెల రోజుల వ్యవధిలో రెండు అంతర్జాతీయ సదస్సులకు ఈ జ్ఞాపికలు వెళ్లడం విశేషం. మరిన్ని ఆర్డర్లు వచ్చాయని, వీణలకు మరింత ఆదరణ పెరుగుతోందని, కళాకారులకు కూడా గౌరవం పెరుగుతోందని కేంద్రం ఇన్‌ఛార్జి రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని