logo

ఉసురు తీసిన సీసా.. మద్యంగా భావించి తాగిన దంపతులు

ఆ దంపతులకు చేపల వేటే ఆధారం. తీరంలో సంచరిస్తూ, చేపలను పట్టుకుని వాటిని అమ్ముకుని ఆ పరిసరాల్లోనే తాత్కాలికంగా నివసిస్తూ ఉంటారు. సముద్రతీరంలో లభించిన ఓ సీసాలోని పానీయం వారి పాలిట మృత్యువైంది. దానిని తాగిన వారిద్దరూ

Updated : 17 Dec 2021 10:38 IST

ఒకరి తర్వాత ఒకరు మృతి

తీరం వద్ద దంపతులకు చెందిన సామగ్రి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆ దంపతులకు చేపల వేటే ఆధారం. తీరంలో సంచరిస్తూ, చేపలను పట్టుకుని వాటిని అమ్ముకుని ఆ పరిసరాల్లోనే తాత్కాలికంగా నివసిస్తూ ఉంటారు. సముద్రతీరంలో లభించిన ఓ సీసాలోని పానీయం వారి పాలిట మృత్యువైంది. దానిని తాగిన వారిద్దరూ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఒంగోలు మండలం చింతాయిగారిపాలెం వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడి సముద్రతీరం వద్ద నాలుగైదు రోజులుగా దంపతులు నివాసం ఉంటూ చేపలవేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పెద్దగా కేకలు వినపడటంతో సమీపంలోని ఉప్పుకొటార్లలో పనిచేస్తున్న వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఓ పురుషుడు గుండెనొప్పితో విలవిల్లాడుతూ కన్నుమూశాడు. సముద్రపు ఒడ్డున మద్యం సీసాను పోలిన సీసా దొరికిందని.. దానిని తాగినట్లు ఆయన భార్య తెలిపారు. ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో స్థానికులు చొరవచూపి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె మృతి చెందారు. ఈ దంపతుల వివరాలు తెలియరాలేదు. చినగంజాం ప్రాంతానికి చెందినవారై ఉంటారని భావించి ఆరా తీస్తున్నారు. ఒంగోలు తాలూకా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని