logo

కొత్తగా 1295 మందికి కొవిడ్‌

జిల్లాలో బుధవారం 1295 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు ల్యాబొరేటరీలో 2215 మందికి పరీక్షలు చేయగా ఇవి వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 58.5గా నమోదైంది. పామూరు మండలం బొట్లగూడూరులో 75 మందికి పరీక్షలు చేయగా.

Published : 27 Jan 2022 06:24 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం 1295 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు ల్యాబొరేటరీలో 2215 మందికి పరీక్షలు చేయగా ఇవి వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 58.5గా నమోదైంది. పామూరు మండలం బొట్లగూడూరులో 75 మందికి పరీక్షలు చేయగా.. 59 మందికి(78.7శాతం) వైరస్‌ సోకినట్లు తేలింది. ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలనీ అర్భన్‌ హెల్త్‌సెంటర్‌ పరిధిలో 65 మందికి పరీక్ష చేయగా.. 48 పాజిటివ్‌ కేసులొచ్చాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 173 కేంద్రాల ద్వారా 18 ఏళ్లు దాటిన వారు 18,931 మందికి, బూస్టర్‌ డోస్‌గా 46,236 మందికి టీకాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని