logo

ప్రకాశిస్తున్నసంక్షేమం

గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం

Updated : 27 Jan 2022 06:45 IST

 ప్రతిష్ఠాత్మకంగా నవరత్నాల అమలు

 కొవిడ్‌ మహమ్మారి కట్టడికి పటిష్ఠ చర్యలు

 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌.. చిత్రంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు

రెడ్డి, ఎస్పీ మలికా గార్గ్, జేసీలు వెంకటమురళి, ఒంగోలు మేయర్‌ సుజాత, ఓఎస్డీ చౌడేశ్వరి  తదితరులు

గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో జిల్లాలో సంక్షేమం ప్రగతి పథాన పరుగులు తీస్తోందని కలెక్టర్‌ ఉద్ఘాటించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...  ఈనాడు డిజిటల్, ఒంగోలు; ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

విస్తృత సేవలు.. ఇళ్ల స్థలాలు...: జిల్లాలో 1058 గ్రామ, వార్డు సచివాలయాలు, 10,352 మంది ఉద్యోగులు, 17,965 మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు విస్తృత సేవలందిస్తున్నాం. ఇప్పటి వరకు 20,07,462 వినతులందగా.. 99.79 శాతం పరిష్కరించాం. స్పందన ద్వారా వచ్చిన 1,89,976 అర్జీల్లో 98.92 శాతం పరిష్కరించాం. 1,34,174 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 3,017 ఎకరాలు సేకరించి 1,312 లేఅవుట్లలో 88,135 మందికి పట్టాలు అందజేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2020-21లో 4,00,474 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాం. ్ర వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ , కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పింఛను కానుక, బీమా, జగనన్నతోడు, అలానే అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలు చేస్తున్నాం.్ర వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా 13,332 మందికి రూ.13.33 కోట్లు ఖాతాల్లో జమ చేశాం.
 ఉపాధి హామీ పథకం కింద 6.42 లక్షల కుటుంబాలకు 2.01 కోట్ల పని దినాలు కల్పించాం.
 ఆర్బీకేలకు సొంత భవనాలు...: నాడు- నేడు కింద మొదటి విడతలో 1388 పాఠశాలల్లో వసతులు కల్పించాం. రెండో విడతలో 1,028 బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ్ర 323 సచివాలయాలు, 229 ఆర్బీకేలు, 105 ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తిచేశాం. 2.8 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు 648 ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.
 మహమ్మారికి ముకుతాడు...: కొవిడ్‌ కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు 25.94 వేల కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 1,48,682 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మరణాల రేటు కేవలం 0.81 శాతంగా ఉంది. వ΄డో దశ కొవిడ్‌ బాధితులకు సేవలందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క కొవిడ్‌ కేర్‌ కేంద్రం, 3,524 పడకలతో 49 కొవిడ్‌ కేర్‌ ఆస్పత్రులలో సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశాం. అర్హులైన 29,33,966 మందికి వంద శాతం మొదటి డోస్‌ కొవిడ్‌ టీకా పూర్తిచేశాం. రెండో డోస్‌ 25,65,314 మందికి, ప్రికాషనరీ డోస్‌ 82.27 శాతంతో 44,204 మందికి అందించాం. 
 వేగంగా వెలిగొండ, నౌకాశ్రయం...: వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయి. స్టేజ్‌ 1 పనులను ఈ ఏడాది ఆగస్టుకు పూర్తిచేసి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుల చేస్తాం. స్టేజ్‌ 2 పనులను 2023 ఫిబ్రవరికి పూర్తిచేయడానికి చర్యలు చేపడుతున్నాం. గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల వద్ద రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక హబ్‌కు 4,620 ఎకరాల భూములు సేకరిస్తున్నాం.


చెత్త తరలించే రిక్షాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు

ఆకట్టుకున్న  7 శకటాలు...
గణతంత్ర వేడుకల్లో భాగంగా ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు, జిల్లా ప్రగతిని చాటుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో మొత్తం ఏడు శకటాలను మాత్రమే ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్యశాఖ; విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ; డీఆర్డీఏ, గృహ నిర్మాణ, డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ, 108, 104; పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటాలతో పాటు; పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ తీరుపై ఏర్పాటు చేసిన వాహన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 ప్రశంసనీయులు 115 మంది...
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉద్యోగ రీత్యా ప్రతిభ చూపిన 115 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదుగా ఉద్యోగులు వీటిని అందుకున్నారు.


వేడుకల్లో కవాతు చేస్తున్న పోలీసు దళం


పరేడ్‌ మైదానంలో పాఠశాల విద్యాశాఖ శకటం ప్రదర్శన 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని