logo

15 మండలాలు.. 893 ఎకరాలు

గతవారం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలపై రైతువారీ నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జేడీఏ ఎస్‌.శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Published : 20 May 2022 02:02 IST

 తుపాను నష్టంపై అంచనా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: గతవారం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలపై రైతువారీ నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జేడీఏ ఎస్‌.శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తుపాను మరుసటి రోజు పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో నష్టం చూపించారు. ప్రాథమిక అంచనా 2500 ఎకరాలు కాగా ఇప్పుడు అది 893 ఎకరాలకు పరిమితమైంది. శింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, సీఎస్‌పురం, పీసీ పల్లి, పామూరు, కనిగిరి, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, కొండపి తదితర మండలాల్లో పంట నష్టాలు జరిగాయి. 33 శాతం పైగా దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉమ్మడిగా అంచనా వేస్తోంది. జేడీఏ మాట్లాడుతూ 15 మండలాల్లో 11 రకాల పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపాక ఇన్‌పుట్‌ రాయితీ విడుదల చేస్తారన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని