logo

ధాన్యం రైతులకు న్యాయం చేయండి

‘‘కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తగ్గించి ధాన్యం కొనుగోలు చేశారు, తద్వారా రైతులు నష్టపోయారు, వారందరికీ న్యాయం చేయండి’’ అంటూ గ్రామానికి చెందిన కవిత మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని

Published : 26 May 2022 06:47 IST

బాలినేనికి అల్లూరులో మొర

తెదేపా, వైకాపా పక్షాల మధ్య వాగ్యుద్ధం

ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన తెదేపా కార్యకర్తపై

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ‘‘కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తగ్గించి ధాన్యం కొనుగోలు చేశారు, తద్వారా రైతులు నష్టపోయారు, వారందరికీ న్యాయం చేయండి’’ అంటూ గ్రామానికి చెందిన కవిత మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరులో బుధవారం సాయంత్రం ‘గడప, గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలినేనికి అర్జీ ఇచ్చారు. ‘రెండేళ్లుగా ధాన్యం కొనుగోలులో రైతులు నష్టపోయారు, ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ.1450 ఇస్తే స్థానిక దళారులు రూ.1100కు కొనుగోలు చేశారు’ అంటూ వాపోయారు. అదే సమయంలో తెదేపా వర్గీయులు మాట్లాడుతూ గత రెండేళ్లుగా రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతలో కొందరు వైకాపా వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. ‘రైతులకు లాభనష్టాలు తెలిసే అమ్ముకున్నారు. బాధిత రైతులుంటే చెప్పమనండంటూ’ స్థానికులకు సూచించారు. ఏ ఊరు మీది అంటూ ఇరువర్గాల మధ్య మాట, మాట పెరగడంతో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి నుంచి వారిని పంపించివేశారు. కాగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రశ్నించిన తెదేపా కార్యకర్తపై బాలినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీలు తొలగించడం నా నైజం కాదు

కలెక్టరేట్‌ వద్ద ఫ్లెక్సీలు కట్టుకుంటే తీయించారని జనార్దన్‌ అంటున్నారని.. అది తమ నైజం కాదని బాలినేని అన్నారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశానని.. ఎవరేమిటో అందరికీ తెలుసన్నారు. తాను చెత్త రాజకీయాలు చేయనన్నారు.. మహానాడుకు లక్ష మంది వస్తారని తెదేపా నాయకులు చెబుతున్నారని.. మినీ స్టేడియంలో పట్టేది 15 వేల మందేనన్నారు. స్టేడియం ఎలా సరిపోతోందని.. అనుమతి ఇవ్వలేదని ఎందుకంటారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని