logo

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి, ఆయా ప్రదేశాల్లో సూచికలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులకు సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం

Published : 28 May 2022 06:29 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి, ఆయా ప్రదేశాల్లో సూచికలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులకు సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘ఐరాడ్‌’ అప్లికేషన్‌ను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ మలికా గార్గ్‌ మాట్లాడుతూ రోడ్లపై ప్రమాద హెచ్చరిక బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండు నెలల్లో ఈ కేసుల్లో సుమారు 40 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించామన్నారు. డీటీసీ కృష్ణవేణి మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండు నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 96 మంది లైసెన్సులు రద్దు చేశామని వివరించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయరత్నం, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలీసు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని