logo

ఆజాదీ స్ఫూర్తి.. మహోత్సవమై నిలిచి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జిల్లా వ్యాప్తంగా సంబరంగా నిర్వహిస్తున్నారు. ‘హెరిటేజ్‌ వాక్‌’లో భాగంగా భారీ జెండాలు, జాతీయ పతాకాలను చేతబట్టి ప్రధాన రహదారుల్లో ప్రదర్శన చేశారు. భారత్‌  

Published : 12 Aug 2022 02:16 IST

కనిగిరి పట్టణంలో 75 మీటర్ల మువ్వన్నెల జెండాతో విద్యార్థుల ప్రదర్శన

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జిల్లా వ్యాప్తంగా సంబరంగా నిర్వహిస్తున్నారు. ‘హెరిటేజ్‌ వాక్‌’లో భాగంగా భారీ జెండాలు, జాతీయ పతాకాలను చేతబట్టి ప్రధాన రహదారుల్లో ప్రదర్శన చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఒంగోలు మండలం దేవరంపాడులోని ఉప్పుసత్యా గ్రహ విజయ స్తూపం వద్ద కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. మహాత్మా గాంధీజీ, ప్రకాశం పంతులు, సాగి విజయరామరాజు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వారి తుపాకులకు ఎదురు నిలిచిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. దేవరంపాడులో ప్రకాశం పంతులు విగ్రహంతో పాటు, ఆయన జీవిత విశేషాలతో కూడిన నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం


దేవరంపాడులో విజయ స్త్తూపంపై జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌..
చిత్రంలో జిల్లా అధికారులు

ఒంగోలు రైజ్‌ కళాశాలలో భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులు

పెద్దారవీడు: కలనూతల సమీపంలోని గుండు కొండపై జాతీయ జెండాతో

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆనందోత్సాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని