logo

విద్యాగ్రహ దీక్ష జయప్రదానికి వినతి

జీవో నం.77 రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్‌ 3న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న విద్యా గ్రహ దీక్షను జయప్రదం చేయాలని తెలుగు విద్యార్థి ఒంగోలు పార్లమెంట్‌ విభాగం అధ్యక్షుడు టి.రవితేజ కోరారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన

Published : 30 Sep 2022 06:39 IST

సమావేశంలో మాట్లాడుతున్న రవితేజ, చిత్రంలో తెలుగు విద్యార్థి ప్రతినిధులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జీవో నం.77 రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్‌ 3న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న విద్యా గ్రహ దీక్షను జయప్రదం చేయాలని తెలుగు విద్యార్థి ఒంగోలు పార్లమెంట్‌ విభాగం అధ్యక్షుడు టి.రవితేజ కోరారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సదరు జీవోను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల విలీన ప్రక్రియకు సంబంధించిన జీవోలు 84, 85, 117, 128 తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు గోగినేని రాకేష్‌, కె.అయ్యప్ప, శివకృష్ణ, పి.రాజశేఖర్‌, పి.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని