logo

గిట్టుబాటు ధర లభించక.. అప్పులు తీర్చలేక...

ఓ వైపు తాను కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గిట్టుబాటు ధర లభించక..

Published : 27 Jan 2023 02:13 IST

పొదలకుంటపల్లెలో శనగల వ్యాపారి ఆత్మహత్య

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఓ వైపు తాను కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గిట్టుబాటు ధర లభించక.. మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక శనగల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన కొప్పురపు శ్రీనివాసులు(48) గత 15 సంవత్సరాలుగా రైతులు పండించిన శనగలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు చేసిన అనంతరం శీతల గోదాముల్లో నిల్వ ఉంచుతుంటారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా శనగలకు సరైన ధరలు లభించక అప్పుల పాలౖయ్యారు. ఇదే సమయంలో వ్యాపార పెట్టుబడి కోసం పొదలకుంటపల్లె, నరవ గ్రామాలకు చెందిన రైతుల వద్ద సుమారు రూ.3 కోట్ల వరకు అప్పులు చేశారు. పది రోజుల క్రితం శ్రీనివాసులు గ్రామం నుంచి బయటికి వెళ్లి తిరిగొచ్చారు. గురువారం తెల్లవారుజామున నిద్ర లేచి గ్రామంలోని బుగ్గ మల్లేశ్వరస్వామి దేవస్థానం వద్దకు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడం, చరవాణికి ఫోన్‌ చేసినప్పటికీ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చిన ఆమె విషయాన్ని స్థానికులకు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా దేవస్థానం వెనుక అచేతనంగా శ్రీనివాసులు పడి ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీనివాసులు కుమారుడు వైకుంఠ వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని