logo

పులి జాడ భయం నీడలో కొలుకుల

యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ సమీప గ్రామమైన కొలుకుల ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. సమీపంలోని చెరువులోకి నీటి కోసం వచ్చి వెళ్తున్నట్లు గుర్తించారు.

Published : 03 Feb 2023 02:05 IST

పులి అడుగుల గుర్తులు సేకరిస్తున్న అటవీ సిబ్బంది

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ సమీప గ్రామమైన కొలుకుల ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. సమీపంలోని చెరువులోకి నీటి కోసం వచ్చి వెళ్తున్నట్లు గుర్తించారు. పులి తిరిగిన చోట కాలి గుర్తులను అటవీ అధికారులు సేకరించారు. గత నాలుగు రోజుల క్రితం జాడలు కనిపించగా అక్కడి రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మరోసారి పులి తిరిగిన ఆనవాళ్లు ఉండడంతో వారంతా భయాందోళనలో ఉన్నారు. దీంతో గ్రామస్థులకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. అడవిలో సాసర్‌ పిట్‌లలో నీటిని నింపుతున్నట్లు యర్రగొండపాలెం రేంజర్‌ నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. బీట్‌ అధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు