ఊసే లేని సచివాలయ ఖాళీల భర్తీ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
సీఎం ప్రకటించి అయిదు నెలలు
ఎదురుచూపుల్లోనే నిరుద్యోగులు
ఒంగోలు మండలం యరజర్ల గ్రామ సచివాలయం
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి వాటి ద్వారానే అవి అమలవుతున్నాయి. మొదటి విడత ప్రకటనలో అన్ని ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో 2020లో రెండో విడత ఉద్యోగులను ఎంపిక చేశారు. కొన్ని శాఖల్లో అర్హులు లేకపోవడంతో గ్రేస్ మార్కులు కూడా కేటాయించారు. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగులుగా... మరికొందరు సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లారు. ఇంకొందరు వివాహాలు చేసుకుని సచివాలయ కొలువు వీడి ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాగే పలు కారణాలతో ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ పోస్టుల్లో సమీప సచివాలయ ఉద్యోగులను ఇన్‌ఛార్జులుగా నియమించి కాలం నెట్టుకొస్తున్నారు.
దీర్ఘకాలిక సెలవులో 276 మంది...
విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో 597 గ్రామ, 122 వార్డు సచివాలయాలున్నాయి. అందులో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల కింద మొత్తం 6,533 మంది ఉద్యోగులు కొనసాగుతుండగా.. 276 మంది వివిధ కారణాలతో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ప్రస్తుతం 6,257 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారిలో గత ఏడాది సుమారు 4,500 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా ఉద్యోగులకు కూడా ఇటీవల రెండేళ్ల సర్వీసు పూర్తికావడంతో క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. పోలీసు శాఖాపరమైన విచారణ పూర్తికాకుండటంతో అందులో కొందరికి మాత్రం ఇంకా ఇవ్వలేదు.
* ఇది ప్రకటన...: ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి. అందుకుగాను వివరాలు సేకరించండి. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి..’
ఇదీ ఈ ఏడాది జనవరి 4న సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆదేశం.
* ఆచరణేమో ఇలా...: గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సమీక్షలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడంపై నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. జిల్లా ఉన్నతాధికారులు కూడా సచివాలయాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి అప్పట్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి నిరుద్యోగ యువత ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. అయిదు నెలల కాలం గడిచినప్పటికీ ఆచరణ దిశగా కార్యాచరణ లేక ఈసురోమంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MotoGP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. నెటిజన్ల మొట్టికాయలతో సారీ!
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?