logo

ఒంగోలు ఆర్వోపై కలెక్టర్‌ ఆగ్రహం

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Mar 2024 02:06 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సంబంధిత అంశాలపై కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులతో పాటు, ఇతర యంత్రాంగంతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సువిధ యాప్‌లో అనుమతుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అందులో ఎన్ని తిరస్కరించారు. అందుకు గల కారణాలతో పాటు, ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, చెక్‌పోస్టుల ఏర్పాటు గురించి ఆర్వో సుబ్బారెడ్డిని కలెక్టర్‌ అడిగారు. అందుకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కలెక్టర్‌ స్పందించి ‘ఏం చేస్తున్నారు.. హ్యాండ్‌ బుక్‌ చదువుకోవడం లేదా’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని