logo

బలప్రదర్శన పోటీల్లో సత్తా

జలుమూరు మండలం కరవంజలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఇందులో పలువురు వస్తాదులు సత్తా చాటారు. సంగిడి, తోపుడురాయి పోటీల్లో గేదల సత్యన్నారాయణ (ఒప్పంగి) ప్రథమస్థానంలో, ద్వితీయస్థానంలో ఆవల గోవిందరావు

Published : 17 Jan 2022 04:04 IST


వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో పాల్గొన్న వర్షిత

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు మండలం కరవంజలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఇందులో పలువురు వస్తాదులు సత్తా చాటారు. సంగిడి, తోపుడురాయి పోటీల్లో గేదల సత్యన్నారాయణ (ఒప్పంగి) ప్రథమస్థానంలో, ద్వితీయస్థానంలో ఆవల గోవిందరావు (నిమ్మాడ) నిలిచారు. తృతీయస్థానాన్ని తమ్మినేని వెంకటేశ్‌, ఎం.వెంకటరావు దక్కించుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మహిళల విభాగంలో గుజ్జల వర్షిత (ఆడవరం) 80 కిలోల బరువు ఎత్తి, పురుషుల విభాగంలో ఆవల గోవిందరావు (నిమ్మాడ) 160 కిలోల బరువు ఎత్తి ప్రథఫమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని