logo

మన్యం జిల్లా కేంద్రంగా సీతంపేటను ప్రకటించాలి

పూర్తి గిరిజన ప్రాంతమైన సీతంపేటను మన్యం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. సీతంపేటలోని సామాజిక భవనంలో శుక్రవారం..

Published : 29 Jan 2022 05:24 IST


సీతంపేటలో సమావేశమైన ఆదివాసీ సంఘాల ఐకాస నాయకులు

సీతంపేట, న్యూస్‌టుడే: పూర్తి గిరిజన ప్రాంతమైన సీతంపేటను మన్యం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. సీతంపేటలోని సామాజిక భవనంలో శుక్రవారం సమావేశమై చర్చించారు. ఈ మేరకు నేడు(శనివారం) సీతంపేట ఆశ్రమ పాఠశాల నుంచి ఐటీడీఏ వరకు శాంతియుత నిరసన ర్యాలీ జరపనున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏను యథావిధిగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బి.ఉమామహేశ్వరరావు, ఎ.భాస్కరరావు, బి.రామ్మోహనరావు తదితరులు ఉన్నారు. * సీతంపేట ఐటీడీఏ కేంద్రంగా మన్యం జిల్లాగా ప్రకటించాలని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జిల్లా నాయకులు ఎ.మన్మధరావు, ఎం.శ్యామ్‌బాబు, ఎన్‌.కాంతారావు, పి.శ్రీనివాసరావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు